Heart Attack: విధుల్లో ఉండగా గుండెపోటు.. బ్యాంకు ఉద్యోగి మృతి!

విధులు నిర్వర్తిస్తున్న ఓ బ్యాంకు ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. కేవలం 30 ఏళ్లకే ఆయనకు కార్డియాక్‌ అరెస్టు రావడం బాధాకరం. 

Published : 27 Jun 2024 00:14 IST

లఖ్‌నవూ: చిన్న వయసులో గుండెపోటు (Heart Attack)తో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా విధులు నిర్వర్తిస్తున్న ఓ బ్యాంకు ఉద్యోగి హఠాత్తుగా సీటులోనే కుప్పకూలాడు. కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే..

 రాజేశ్‌ కుమార్‌ శిందే స్థానిక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వ్యవసాయ విభాగానికి మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. రోజులాగానే ఆఫీస్‌కు వెళ్లిన ఆయన విధులు నిర్వర్తిస్తుండగా.. ఒక్కసారిగా సీటులో కుప్పకూలారు. గమనించిన సహోద్యోగులు సీపీఆర్‌ చేసి కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. ఆయన పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడకపోవడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.

జీరో FIR, ఆన్‌లైన్‌ ఫిర్యాదులు.. జులై 1 నుంచే కొత్త చట్టాలు!

అప్పటికే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కేవలం 30 ఏళ్ల వయసులో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దేశంలో చాలా మంది గేమ్‌ ఆడుతూ, ఇతర పనులు చేస్తూనే కార్డియాక్‌ అరెస్టుతో మృతి చెందిన సందర్భాలు చూశాం. వీరిలో చాలా వరకు చిన్న వయసులోని వారే. గుండెపోటుకు ఒత్తిడి, ఆహార ఎంపిక, జీవన శైలి కారణమంటూ నిపుణులు పేర్కొంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని