Dengue fever: ముంబయికి ‘డెంగీ’ ఫీవర్‌.. ఈ 12 రోజుల్లోనే 85 కేసులు!

కరోనా విజృంభణతో విలవిల్లాడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంబయి మహా నగరాన్ని ఇప్పుడు డెంగీ జ్వరం పీడిస్తోంది. దోమకాటుతో సోకే డెంగీ రోగుల రోజురోజుకీ అక్కడ పెరగడం ......

Published : 14 Sep 2021 21:48 IST

ముంబయి: కరోనా విజృంభణతో విలవిల్లాడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంబయి మహా నగరాన్ని ఇప్పుడు డెంగీ జ్వరం పీడిస్తోంది. దోమకాటుతో సోకే డెంగీ రోగుల రోజురోజుకీ అక్కడ పెరగడం కలకలం రేపుతోంది. గతేడాది మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో 129 డెంగీ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ 12 వరకు 305 మందికి డెంగీ సోకడం గమనార్హం. సెప్టెంబర్‌ 1 నుంచి 12 మధ్య కాలంలోనే 85 కేసులు నమోదైనట్టు బృహాన్‌ ముంబయి పురపాలక కార్పొరేషన్‌ (బీఎంసీ) వెల్లడించింది. అయితే, డెంగీతో గతేడాది మూడు మరణాలు నమోదు కాగా.. ఈ ఏడాది ఒక్క మరణమూ సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఏడాది ఆగస్టులో 144 డెంగీ కేసులు రాగా.. సెప్టెంబర్‌ 1 నుంచి 12 మధ్యకాలంలోనే 85 కేసులు నమోదైనట్టు బీఎంసీ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు క్రిమి నియంత్రణ విభాగం 4.46లక్షల ఇళ్లను తనిఖీ చేసి నగరంలో దోమలు పెరిగే  4,108 కేంద్రాలను గుర్తించి నాశనం చేసినట్టు వెల్లడించారు. ఇళ్లల్లో దోమలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, టిన్‌లు, థర్మోకోల్‌ పెట్టెలు, కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత వస్తువుల్లాంటివి ఇళ్లల్లో ఉంచరాదని సూచిస్తున్నారు. నగరంలో దోమలు పెరిగే ప్రాంతాలను నాశనం చేసేందుకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని