Updated : 25 Jan 2021 23:48 IST

32 మందికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం

 విజేతలతో మాట్లాడిన మోదీ..

దిల్లీ: వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 32 మంది పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం -2021 అందించనున్నట్లు  కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. నూతనావిష్కరణలు, విద్యా, క్రీడలు, కళలు, సంస్కృతి, సామాజిక సేవ, ధైర్య సాహసాల వంటి రంగాల్లో విజయం సాధించిన బాలలకు  అవార్డు ప్రదానం చేస్తారు. ఈ మేరకు అవార్డుకు ఎంపికైన బాలలు 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 32 జిల్లాలకు చెందినవారని శాఖ తెలిపింది. ఈ క్రమంలో విజేతలతో ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొవిడ్‌-19 సమయంలో ప్రజలు కరచాలనం చేయకుండా పిల్లలు అవగాహన కల్పించడం ప్రశంసనీయమన్నారు.  

బాలలు తమ లక్ష్య సాధనకై కృషి చేయాలని ఆయన సూచించారు. దేశ శ్రేయస్సు కోసం పాటుపడినవారి జీవిత చరిత్రలను చదవాలని పిల్లలకు ఆదేశించారు. నేటితరం బాలల్లో గొప్ప నైపుణ్యం దాగి ఉందని ప్రశంసిచారు. నూతన ఆవిష్కరణల దృష్ట్యా దేశానికి ఆధునిక వ్యవసాయం అవసరమన్నారు. ఈ సందర్భంలో విజేతలను  ప్రశంసిస్తూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఒక సందేశాన్ని ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానం కేవలం ప్రోత్సాహకంగానే కాకుండా... చిన్నారుల కలల సాకారానికి తొలి విజయంగా భావించాలని ఆయన సూచించారు.  ఈ అవార్డుతో పాటు విజేతలకు బాల శక్తి పురస్కారాన్ని అందించనున్నట్లు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వివరించింది. 


ఇవీ చదవండి..

భారత్‌లో మోడెర్నా టీకా: టాటా ప్రయత్నాలు!

కరోనా కష్టాలు పేదలకే!

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని