Weddings: 40 రోజులు.. 32లక్షల పెళ్లిళ్లు.. రూ.3.75లక్షల కోట్ల వ్యాపారం!
నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు దేశ వ్యాప్తంగా 32లక్షల వివాహాలు జరగనున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. లక్షలాది జంటలను ఏకం చేసేందుకు మోగే బ్యాండ్ బాజాలు మార్కెట్ వర్గాలకు కొత్త శోభను తేనున్నాయి.
దిల్లీ: ఈ దీపావళి పండుగ సీజన్‌లో తమ వ్యాపార కార్యకలాపాలు జోరుగా కొనసాగించిన ట్రేడ్ వర్గాలకు మరో బోనంజా. నవంబర్-డిసెంబర్ మాసాల్లో జరిగే లక్షలాది జంటల పెళ్లి సందడి దేశ వ్యాపార లావాదేవీలకు మరింత ఊపు ఇవ్వనుంది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు దేశ వ్యాప్తంగా 32లక్షల వివాహాలు జరగనున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. లక్షలాది జంటలను ఏకం చేసేందుకు మోగే బ్యాండ్ బాజాలు మార్కెట్ వర్గాలకు కొత్త శోభను తేనున్నాయి. ఈ సీజన్‌లో దాదాపు 32లక్షల వివాహలు జరగనుండగా.. వాటి ద్వారా సుమారు రూ.3.75లక్షల కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని సీఐఏటీ అంచనా వేసింది. ఆ సంస్థ రీసెర్చ్ విభాగం నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ అంచనాలను వెలువరించింది. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 35 నగరాల్లోని 4,302 మంది వర్తకులు, సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించింది.
ఒక్క దిల్లీలోనే రూ.75వేల కోట్ల వ్యాపారం!
ఈ సందర్భంగా సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఒక్క దిల్లీలోనే ఈ సీజన్‌లో 3.5లక్షల వివాహాలు జరగనున్నాయని.. తద్వారా దాదాపు రూ.75వేల కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం ఉందన్నారు. గతేడాది ఇదే సీజన్‌లో దేశంలో 25లక్షల వివాహాలు జరగ్గా.. రూ.3లక్షల కోట్లు మేర వ్యాపారం జరిగిందని తెలిపారు. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో మార్కెట్లలో మొత్తంగా రూ.3.75లక్షల కోట్లు మేర ప్రవహించనున్నాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. వచ్చే వచ్చే పెళ్లిళ్ల సీజన్ జనవరి 14 నుంచి జులై వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kangana Ranaut: నా వాట్సాప్ డేటా లీక్ చేస్తున్నారు.. స్టార్ కపుల్పై కంగనా ఆరోపణలు
-
World News
EarthQuake: తుర్కియే, సిరియాలో భారీ భూకంపం.. 90మందికి పైగా మృతి
-
Movies News
Telugu Movies: ఈ వారం ఇటు థియేటర్ అటు ఓటీటీ సందడే సందడి
-
World News
US Visa: విదేశాల్లో ఉన్న భారతీయులకు అక్కడే అమెరికా వీసా
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
Telangana News: గూగులమ్మకు యూట్యూబ్ కళాకారుల బోనాలు