pilgrims test covid positive: తమిళనాడు వచ్చి వెళ్లిన 35 మంది కర్ణాటక వాసులకు కోవిడ్‌ నిర్ధారణ

తమిళనాడులోని ఆదిపరాశక్తి ఆలయ దర్శనానికి వచ్చిన కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన 35 మంది భక్తులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. వీరు కర్ణాటకలోన..

Published : 04 Jan 2022 15:47 IST

మాండ్య (కర్ణాటక): తమిళనాడులోని ఆదిపరాశక్తి ఆలయ దర్శనానికి వచ్చిన కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన 35 మంది భక్తులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. వీరు కర్ణాటకలోని మాండ్య జిల్లా శ్రీరంగపట్నం నుంచి మూడు రోజుల క్రితం చెంగల్‌పట్టు జిల్లా మేల్‌ మరువత్తూర్‌ ఆదిపరాశక్తి ఆలయ దర్శనం చేసుకున్నారు. 100మందికి పైగా పురుషులు, స్ర్తీలు మూడు బస్సుల్లో రాగా, వీరిలో రెండు బస్సులకు చెందిన యాత్రికులు సోమవారం సాయంత్రం మాండ్య చేరుకున్నారు. వీరికి చెక్‌పోస్ట్‌ వద్ద ఆరోగ్యశాఖ అధికారులు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు.పరీక్షా ఫలితాల్లో 35మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు.మరో బస్సులోని ప్రయాణికులు మరికొన్ని ప్రాంతాల సందర్శనలో ఉండగా వారు మంగళవారం సాయంత్రం మాండ్య చేరుకోనున్నారని వారిని కూడా పరీక్షించేందుకు వారిపై నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు.వీరు తమిళనాడుతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలను సందర్శించినట్లు  తెలిసిందన్నారు.బస్సులో ఉన్న వారికే కాకుండా వారు కర్ణాటకలో ఏఏ ప్రాంతాలకు వెళ్లారన్న దానిపై సమాచారం రాబడుతున్నట్లు తెలిపారు. వారు వెళ్లిన ప్రాంతాల్లో  వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి అనుమానితులకు పరీక్షలు నిర్వహించడంపై దృష్టి సారించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని