lightning strikes: పిడుగుపాట్లతో వణికిన యూపీ.. ఒక్కరోజే 38 మంది మృతి!

భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్‌ అతలాకుతలం అవుతోంది. పిడుగుపాట్లతో ఒక్క రోజులోనే 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Published : 11 Jul 2024 13:51 IST

లఖ్‌నవూ: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈశాన్యంలోని అస్సాంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో పిడుగుపాటు కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలన్నీ ఒక్క రోజులోనే సంభవించడం గమనార్హం. వీటి కారణంగా మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది.

వరదల కారణంగా యూపీలో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వేరువేరు ప్రాంతాల్లో పడిన పిడుగుల కారణంగా 38 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఓ మహిళ, చిన్నారులు కూడా ఉండడం విషాదకరం. పిడుగుపాటు వల్ల ప్రతాప్‌గఢ్‌లో అత్యధికంగా 11 మంది మరణించారు. సుల్తాన్‌పుర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురలో ఐదుగురు, ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు, మరికొన్ని జిల్లాల్లో ఒక్కో మరణం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.

తప్పుడు ధ్రువీకరణలు సమర్పించిన ట్రెయినీ ఐఏఎస్‌.. పూజా వ్యవహారంలో మరో ట్విస్ట్‌

రానున్న ఐదు రోజుల్లో యూపీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పొరుగు రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం కొనసాగుతుందని అంచనా వేసింది. కాగా.. ముంబయి నగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో కొన్ని ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు