నితీశ్‌ కుమార్‌పై చెప్పు.. నలుగురి అరెస్ట్

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై చెప్పు విసిరిన ఘటనలో నలుగురు అరెస్టయ్యారు. 

Updated : 27 Oct 2020 13:56 IST

ముజఫర్‌పూర్‌: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై చెప్పు విసిరిన ఘటనలో నలుగురు అరెస్టయ్యారు. ముజఫర్‌పూర్ జిల్లాలోని సాక్రా గ్రామంలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రసంగం అనంతరం హెలికాఫ్టర్ వద్దకు వస్తుండగా కొందరు నిరసనకారులు ఆయన వైపు చెప్పు విసిరారు. అయితే అది ఆయనకు కొంత దూరంలో పడింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా బిహార్‌ ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి నితీశ్‌‌ పలు చోట్ల చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్నిసార్లు నిగ్రహాన్ని కోల్పోయి నిరసనకారులపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఓ ర్యాలీలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు అనుకూలంగా కొందరు నినాదాలు చేయడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ‘ఏమిటీ నాన్సెన్స్’ అంటూ కోపంతో ఊగిపోయారు. రాజకీయ ప్రత్యర్థుల ప్రోద్బలంతోనే వారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారు తనకు ఓటు వేయకపోయినా బాధపడనని.. కానీ ఈ విధమైన ఘటనలను సహించబోనని నితీశ్‌ కుమార్ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని