ప్రీ-క్లినికల్ ట్రయల్స్‌లో 4 దేశీయ వ్యాక్సిన్లు 

దేశంలో నాలుగు వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు ప్రి-క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని మంత్రి పార్లమెంటుకు వివరించారు.

Published : 21 Sep 2020 11:07 IST

పార్లమెంటులో వెల్లడించిన ఆరోగ్య మంత్రి

దిల్లీ: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ, సహాకారాలు అందజేస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. కాగా, దేశంలో నాలుగు వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు ప్రి-క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని ఆయన పార్లమెంటుకు వివరించారు.

‘‘ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ తయారీలో 145 సంస్థలు ముందంజలో ఉన్నాయి. వాటిలో 35 క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయి. ఇక భారత్‌ విషయానికి వస్తే.. దేశంలోని వ్యాక్సిన్‌ తయారీలో ఉన్న 30 ఫార్మా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందజేస్తున్నాం. వాటిలో మూడు అడ్వాన్స్‌డ్‌ ట్రయల్స్‌ 1,2,3 దశల్లో ఉన్నాయి. కాగా, మరో నాలుగు ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయి.’’ అని మంత్రి లోక్‌సభలో వెల్లడించారు. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో 50,000 దేశీయ వెంటిలేటర్ల ఏర్పాటు నిమిత్తం పీఎం కేర్స్‌ నిధి నుంచి ఆరోగ్యశాఖకు రూ.893.93 కోట్ల విరాళం లభించినట్టు కూడా ఆయన వివరించారు.

వ్యాక్సిన్‌ తయారీలో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, అహ్మదాబాద్‌ ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలాల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన వివరించారు. భారత్‌ బయోటెక్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని