Crime news: పాక్‌ నుంచి స్మగ్లింగ్‌.. రూ.200 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.200 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను పంజాబ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారత్‌- పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దు ........

Published : 21 Aug 2021 23:51 IST

చండీగఢ్‌: అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.200 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను పంజాబ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారత్‌- పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పంజ్‌గ్రెయిన్‌ ప్రాంతంలో పంజాబ్‌ పోలీసులు, సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్‌) సంయుక్త ఆపరేషన్‌లో 40కిలోలకు పైగా హెరాయిన్‌ను పట్టుకున్నారు. దీనిపై అమృత్‌సర్‌ గ్రామీణ సీనియర్‌ ఎస్పీ గుల్‌నీత్‌ సింగ్‌ ఖురానా మాట్లాడుతూ.. కరడుగట్టిన స్మగ్లర్‌  నిర్మల్‌ సింగ్‌, అమృత్‌సర్‌కు చెందిన ఓ వ్యక్తి కలిసి పాక్‌ నుంచి భారీగా హెరాయిన్‌ తరలిస్తున్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. ఈ సమాచారం బీఎస్‌ఎఫ్‌తో పంచుకొని సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి 39 ప్యాకెట్లలో ఉన్న దాదాపు 40 కిలోలకు పైగా  హెరాయిన్‌ను సీజ్‌ చేసినట్టు తెలిపారు. పాక్‌కు చెందిన స్మగ్లర్ల మాదక ద్రవ్యాల రవాణాను భగ్నం చేసినట్టు చెప్పారు. పంజాబ్‌ పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కలిసి విజయవంతంగా మాదకద్రవ్యాలను సీజ్‌ చేశారని డీజీపీ దిన్‌కర్‌ గుప్తా అన్నారు. పోలీసులు సీజ్‌ చేసిన వాటిలో హెరాయిన్‌తో పాటు 180 గ్రాముల ఒపియం, పాక్‌లో తయారైన రెండు ప్లాస్టిక్‌ పైపులు కూడా ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని