ఆ యూనివర్సిటీలో 40 మందికి పాజిటివ్‌

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా పాఠశాలలు, కళాశాలు, వర్సిటీలలో వైరస్‌ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో కొవిడ్ కలకలం సృష్టించింది. ఈ మేరకు మొత్తంగా 40 మంది విద్యార్థులు, అధ్యాపకులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు...

Updated : 28 Mar 2021 20:59 IST

అహ్మదాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా పాఠశాలలు, కళాశాలు, వర్సిటీలలో వైరస్‌ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో కొవిడ్ కలకలం సృష్టించింది. ఈ మేరకు మొత్తంగా 40 మంది విద్యార్థులు, అధ్యాపకులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం వారిని క్వారంటైన్‌కు తరలించినట్లు అహ్మదాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ డిప్యూటీ హెల్త్‌ ఆఫీసర్‌ మెహుల్‌ ఆచార్య తెలిపారు. కాగా,  ఐఐటీ గాంధీనగర్‌లో మరో 25 మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో కళాశాల ప్రాంగణంలో కొవిడ్‌ ఆంక్షలు విధించినట్లు అధికారులు వివరించారు.

బెంగళూరు.. 26 రోజుల్లో 470 మంది చిన్నారులకు పాజిటివ్‌ 

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమవడం కలవరపెడుతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా కొవిడ్‌ పంజా విసురుతోంది. అయితే బెంగళూరులో గత 26 రోజుల వ్యవధిలో పది సంవత్సరాలకు తక్కువ వయసున్న 470 మంది చిన్నారులు కరోనా బారిన పడినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు 244 బాలురు, 228 బాలికలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. కాగా, సిటీలో రోజూ 46 మంది చిన్నారులకు పాజిటివ్‌గా తేలుతుందని చెప్పారు. బహిరంగ ప్రదేశాలలో, ఇతర కార్యకలాపాలల్లో పిల్లలు పాల్గొనడంతో అధిక సంఖ్యలో వైరస్‌ బారిన పడుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రుల నుంచి కూడా పిల్లలకు కొవిడ్ వ్యాప్తి జరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా, చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని అధికారులు వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని