త్రివిధ దళాల్లో 42 వేల మందికి కరోనా

దేశంలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, వాయుసేనలోని మొత్తం 42,848 మంది కరోనా బారిన పడ్డారని రక్షణశాఖ సహాయక మంత్రి శ్రీపాద నాయక్‌ తెలిపారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సోమవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

Published : 08 Mar 2021 22:40 IST

దిల్లీ: దేశంలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మొత్తం 42,848 మంది ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారని రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్‌ తెలిపారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సోమవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. భారత సైన్యంలో 32,690 మందికి కరోనా సోకగా మరణాల రేటు 0.24 శాతంగా ఉందని తెలిపారు. వాయు సేనలో 6,554 కేసులు నమోదు కాగా, మరణాల రేటు 0.39 శాతంగా ఉందన్నారు. నావికా దళంలో 3,604 మందికి కరోనా సోకగా మరణాల రేటు 0.05 శాతంగా ఉందని వెల్లడించారు. ఏవైనా అంటువ్యాధుల కారణంగా సర్వీసులో ఉన్న సాయుధ దళ సిబ్బంది మరణిస్తే నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి ప్రత్యేక పరిహారం అందించబోమని మంత్రి తెలిపారు. ఇతర అన్ని పరిహారాలూ వారికి అందిస్తామని ఆయన రాజ్యసభలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని