
ఐదుగురు చొరబాటుదారుల హతం
దిల్లీ: పంజాబ్‌లో సరిహద్దు ప్రాంతాల నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడుతున్న ఐదుగురిని బీఎస్‌ఎఫ్ దళాలు కాల్చి చంపాయి. తార్న్ తరన్ జిల్లా ఖేమ్‌కరన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం 4.45 గంటల ప్రాంతంలో ఐదుగురు చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడాన్ని బీఎస్‌ఎఫ్ జవానులు గుర్తించారు. అడ్డుకునే క్రమంలో భారత జవాన్లపై వారు కాల్పులకు పాల్పడ్డారు. ఆత్మరక్షణలో భాగంగా చొరబాటు దారులపై కాల్పులు జరిపినట్లు బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు చొరబాటుదారులు హతమైనట్లు పేర్కొన్నారు. వారి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.