Goa: జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకొని!

గోవాలోని జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన 80 మంది పర్యాటకులు వరదలో చిక్కుకుపోయారు.

Updated : 07 Jul 2024 18:00 IST

పనాజీ: ఓ జలపాతం చూసేందుకు వెళ్లిన టూరిస్టులకు ఊహించని పరిణామం ఎదురైంది. భారీ వర్షాల కారణంగా సమీపంలోని నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో దాదాపు 80 మంది వరదలోనే చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఘటన గోవా (Goa)లో చోటు చేసుకొంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..

గోవాలోని సత్తారి తాలూకాలోని పాలి జలపాతానికి ఆదివారం భారీ సంఖ్యలో పర్యాటకులు వెళ్లారు. జలపాతాన్ని చేరుకోవాలంటే ముందుగా ఓ నదిని దాటాల్సి ఉంటుంది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో అక్కడి చేరుకున్నారు. అప్పటికే భారీ వర్షం రావడంతో నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో 80 మంది అక్కడే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత

ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను కాపాడేందుకు చర్యలను ముమ్మరం చేసాయి. ఇప్పటివరకు 50 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరో 30 మంది అక్కడే చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అక్షత్‌ కౌశల్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని