భారత్‌ దిగుమతుల్లో చైనాదే అగ్రస్థానం

సరిహద్దు ఘర్షణలతో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ దిగుమతుల్లో చైనాపైనే భారత్‌ ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్‌ దిగుమతులు చేసుకునే దేశాల జాబితాలో 2020లో చైనా అగ్రస్థానంలో ఉంది....

Published : 19 Mar 2021 11:02 IST

దిల్లీ: సరిహద్దు ఘర్షణలతో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ దిగుమతుల్లో చైనాపైనే భారత్‌ ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్‌ దిగుమతులు చేసుకునే దేశాల జాబితాలో 2020లో చైనా అగ్రస్థానంలో ఉంది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో చైనా నుంచి దాదాపు 58.71 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ మాలరాయి ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ జాబితాలో చైనా తర్వాత అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్‌ దేశాలు ఉన్నాయన్నారు. చైనా నుంచి ఎక్కువగా టెలికాం పరికరాలు, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ పరికరాలు దిగుమతి అవుతున్నాయని వెల్లడించారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని