Jio 5G: 5జీ టెక్నాలజీతో అపరిమితమైన అవకాశాలు: హిమంత

అస్సాంలో జియో 5జీ సేవలను సీఎం హిమంత బిశ్వశర్మ ప్రారంభించారు. ఈ సేవలతో మొబైల్‌ కనెక్టివిటీలో అస్సాం నవ శకంలోకి ప్రవేశించిందన్నారు. 

Published : 10 Jan 2023 23:42 IST

గువాహటి: రాష్ట్రంలో 5జీ టెక్నాలజీ(5G technology) అందుబాటులోకి రావడం తమ ప్రజల అపరిమిత అవకాశాలకు ఆరంభమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(Himanta Biswa Sarma) అన్నారు. ఈ టెక్నాలజీ ఫలితంగా ఆర్థిక, సామాజిక జీవనంతో పాటు అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. గువాహటిలో రిలయన్స్‌ జియో 5జీ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రూ 5జీ సేవలకు సంబంధించిన ప్రయోజనాలపై జియో ప్రతినిధులు సీఎంకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ప్రధాని మోదీ స్వదేశీ 5జీ టెక్నాలజీని విజయవంతంగా ప్రారంభించిన తర్వాత మొబైల్ కనెక్టివిటీలో అస్సాం నవశకంలోకి ప్రవేశించిందన్నారు. మొదట్లో చైనీస్‌ లేదా అమెరికన్‌ టెక్నాలజీని అవలంబిస్తారేమోననే చర్చ జరిగిందని, అయితే, అంతిమంగా మన స్వదేశీ సాంకేతికతతో 5జీని ప్రారంభించగలిగామన్నారు. తద్వారా భారతదేశం ఎలా స్వయం సమృద్ధిగా నిలుస్తుందో మన సామర్థ్యమేంటో ప్రదర్శించామని చెప్పారు. సవాళ్లు ఎదురైనప్పుడు భారతీయ శాస్త్రవేత్తలు, పారిశ్రామిక సంస్థలు ఆ సందర్భానికి తగినట్టుగా ఎలా ఎదగగలవో నిరూపించామన్నారు. గువాహటి తర్వాత ఈ సర్వీసుల్ని సిల్చార్‌, ఇతర ప్రధాన పట్టణాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని