
Published : 07 Oct 2021 22:34 IST
Tokyo: టోక్యోలో భూకంపం
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. తూర్పు టోక్యోలో 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ ప్రకంపనలకు భవనాలు కదలినప్పటికీ.. ఎలాంటి ప్రాణ హానీ జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు. అదే విధంగా సునామీ వచ్చే అవకాశాలు లేవన్నారు. ఇక జపాన్లో భూకంపం సంభవించడం ఈసంవత్సరంలో ఇది రెండోసారి. మార్చి నెలలో ఉత్తర జపాన్లోని మియాగి ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో 54 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ఇవీ చదవండి
Tags :