Gold: విమానం టాయిలెట్‌లో భారీగా బంగారం స్వాధీనం

సుమారు 9.02 కిలోల బరువున్న ఈ బంగారం విలువ రూ.4.21కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Published : 04 Jun 2022 21:50 IST

చెన్నై: తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి చెన్నైకి చేరుకున్న ఇండిగో విమానం టాయిలెట్‌లో దాదాపు 60 బంగారు కడ్డీలు గుర్తించినట్టు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. సుమారు 9.02 కిలోల బరువున్న ఈ బంగారం విలువ రూ.4.21కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కస్టమ్స్‌ చట్టం -1962లోని పలు సెక్షన్ల కింద తాము స్వాధీనం చేసుకున్న ఈ గోల్డ్‌ బార్‌లపై విదేశీ మార్కింగ్‌ ఉన్నట్టు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మరోవైపు, ఇంకో ఘటనలో దుబాయి నుంచి వచ్చిన 61 ఏళ్ల వృద్ధుడి నుంచి కూడా రూ.25.87లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. వృద్ధుడు తన లగేజీలోని టూల్‌బాక్స్‌లో దాచి 11 బంగారం రాడ్లను తీసుకెళ్తుండగా తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులు వాటిని సీజ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని