Gangasagar Pilgrims: బంగాళాఖాతంలో చిక్కుకుపోయిన 600 మంది ‘గంగా సాగర్‌’ యాత్రికులు

పుణ్యస్నానాలకు వెళ్లిన 600 మంది యాత్రికులు సముద్రం మధ్యలో చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు కోస్టుగార్డు సిబ్బంది హోవర్‌క్రాఫ్ట్‌లను అక్కడికి తరలించారు. 

Published : 16 Jan 2023 15:15 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమబెంగాల్లో(West Bengal)ని 24 పరగణాల జిల్లా గంగాసాగర్‌(Gangasagar)లో పుణ్య స్నానాలకు వెళ్లిన సుమారు 600 మంది భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకుపోయారు. దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగి వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఇక్కడ హుగ్లి నది-బంగాళాఖాతంలో సంగమించే చోటుకు వీరు రెండు ఫెర్రీల్లో వెళ్లారు. కానీ, సముద్రంలో ఆటు రావడంతో నీరు తగ్గి ఆ రెండు ఫెర్రీలు బురదలో చిక్కుకుపోయాయి.

యాత్రికులు రాత్రి మొత్తం సముద్రంలోనే గడపాల్సి వచ్చింది. ఈ ఘటన కాక్‌ద్వీప్‌ వద్ద చోటు చేసుకొంది. దీంతో వీరిని రక్షంచడానికి కోస్టుగార్డ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. వీరికి సహాయ కోసం హోవర్‌ క్రాఫ్ట్‌ను కూడా పంపారు. నిన్న ఒక్క రోజే మకర సంక్రాంతి సందర్భంగా గంగాసాగర్‌లో దాదాపు 10 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. దాదాపు 51 లక్షల మంది గంగాసాగర్‌ను సందర్శించి పూజలు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని