
Karnataka: ఔరా.. 66 ఏళ్ల వయసులో అరేబియా సముద్రాన్ని ఈదేశాడు..!
ఉడిపి: విశ్రాంతి తీసుకునే వయసులో.. కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు అసాధారణ ఘనత సాధించాడు. ఉడిపికి చెందిన 66 ఏళ్ల గంగాధర్ ఖేడ్కర్.. కాళ్లు, చేతులకు గొలుసులు కట్టుకొని అరేబియా సముద్రాన్ని నాలుగున్నర గంటల్లోనే ఈదేశారు. తద్వారా గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. సాధారణంగా విశ్రాంతి తీసుకునే వయసులో ఆయన ఈ రికార్డు సాధించడం చాలా గొప్ప విషయమంటూ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి మనీశ్ విష్ణోయ్ కొనియాడారు. తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్టు గంగాధర్ తెలిపారు. కాళ్లూ చేతులు కట్టేసుకొని.. డాల్ఫిన్ తరహాలో ఈదినట్టు చెప్పారు. చిన్నారులకు ఆదర్శంగా నిలిచేందుకు ఈ రికార్డు కోసం ప్రయత్నించినట్టు పేర్కొన్నారు. గతంలోనూ ఆయన పలు రికార్డులను నెలకొల్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.