Mamata Banerjees: మమతా బెనర్జీపై మీమ్స్‌ పోస్టు చేసిన యూట్యూబర్లపై కేసులు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మీమ్స్‌ పోస్టు చేసిన ఏడుగురు యూట్యూబర్లపై కోల్‌కత్తా పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరిని ఇప్పటికే అరెస్టు

Updated : 28 Sep 2022 01:19 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మీమ్స్‌ పోస్టు చేసిన ఏడుగురు యూట్యూబర్లపై కోల్‌కత్తా పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరిని ఇప్పటికే అరెస్టు చేశారు. మమతా బెనర్జీ ప్రసంగాల ఆధారంగా అభ్యంతరకరమైన మీమ్స్‌ను పోస్టు చేశారంటూ సాగర్‌ దాస్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టిక్‌టాకర్‌ ప్రచితా, టోటల్‌ ఫన్‌ బంగ్లా, రియా ప్రియా, సాగరికా బర్మన్‌ వ్లాగ్స్‌, లైఫ్‌ లైన్‌ ఇన్‌ దుర్గాపూర్‌, ఫ్రెండ్స్‌ క్యాంపస్‌, పూజాదాస్‌ 98 వంటి పేర్లను అతడు  ప్రస్తావించాడు.  

మమతా బెనర్జీ ప్రసంగం నుంచి తీసుకొన్న కొన్ని భాగాలను మీమ్స్‌లో వాడారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. ఈ అభ్యంతరకరమైన మీమ్స్‌ కారణంగా ఘర్షణలు చెలరేగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆరోపించాడు. నిందితులు వ్యక్తిగత సంపాదన కోసమే మీమ్స్‌ను తయారు చేశారన్నాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీస్‌ స్టేషన్‌లో కేసును రిజిస్టర్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని