Vaccination: దేశంలో 18 ఏళ్లు నిండినవారిలో 70 శాతం మందికి తొలి డోసు పూర్తి

వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భారత్‌ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఇటీవల దేశవ్యాప్తంగా 90 కోట్ల డోసుల పంపిణీ పూర్తయిన విషయం తెలిసిందే. తాజాగా దేశ జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 70 శాతం మందికి తొలి డోసు పూర్తి కావడం విశేషం. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సోమవారం ట్విటర్‌...

Updated : 04 Oct 2021 18:45 IST

దిల్లీ: వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భారత్‌ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఇటీవల దేశవ్యాప్తంగా 90 కోట్ల డోసుల పంపిణీ పూర్తయిన విషయం తెలిసిందే. తాజాగా దేశ జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 70 శాతం మందికి తొలి డోసు పూర్తి కావడం విశేషం. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సోమవారం ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘బలమైన దేశం.. వేగవంతమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ. 18 ఏళ్లు దాటిన 70 శాతం మందికి తొలి డోసు పూర్తయింది. మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో.. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం కొత్త లక్ష్యాలను సాధిస్తోంది. శభాష్‌ ఇండియా. కరోనాపై పోరాడదాం’ అని మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.

పెరిగిన రోజువారీ డోసుల సగటు

దేశవ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం నాటికి  మొత్తం 91.10 కోట్ల డోసులు పంపిణీ చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. దేశ జనాభాలో 25 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. మరోవైపు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 5.67 కోట్లకు పైగా డోసులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఒక నెలలో రోజువారీగా పంపిణీ చేసే డోసుల సగటు మే నెలలో 19.69 లక్షలు ఉండగా.. సెప్టెంబరు నాటికి 79.08 లక్షలకు పెరిగింది. సరిపడా టీకాల లభ్యత, పకడ్బందీ ప్రణాళికల ద్వారా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోందని కేంద్రం వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని