vacancies: ఆర్మీలోనే అత్యధిక ఖాళీలు: కేంద్రం

త్రివిధ దళాల్లోని ఖాళీల వివరాలను పార్లమెంట్‌ వేదికగా కేంద్రం వెల్లడించింది. ఆర్మీలో 7,476 ఆఫీసర్‌ స్థాయిలో పోస్టులు భర్తీ కావాల్సి ఉందని తెలిపింది.

Published : 06 Dec 2021 19:59 IST

దిల్లీ: త్రివిధ దళాల్లోని ఖాళీల వివరాలను పార్లమెంట్‌ వేదికగా కేంద్రం వెల్లడించింది. ఆర్మీలో 7,476 ఆఫీసర్‌ స్థాయిలో పోస్టులు భర్తీ కావాల్సి ఉందని తెలిపింది. ఎయిర్‌ఫోర్స్‌లో 1265 ఖాళీలు, నేవీలో 621 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ వెల్లడించారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఆర్మీలో మొత్తంగా 97,177 పోస్టులు ఖాళీ ఉన్నట్లు భట్‌ తెలిపారు. నేవీలో 11,166 ఖాళీలు, ఎయిర్‌ఫోర్స్‌లో 4,850 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఆర్మీలోనే ఖాళీలు ఉన్నాయని, అన్ని రెజిమెంట్లు, సేవల విభాగాల్లో ఈ కొరత ఉందని వెల్లడించారు. ఈ ఖాళీల భర్తీకి కేంద్రం వివిధ రకాల చర్యలు తీసుకుంటోందని వివరించారు. యువతలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని