‘హిమాచల్‌’లో 76 రహదారులు మూసివేత.. 3 జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక!

హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

Updated : 08 Jul 2024 20:06 IST

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal Pradesh) కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి.  పలుచోట్ల భారీ వర్షాల నేపథ్యంలో 76 రహదారులను మూసివేశారు. వీటిలో 52 రహదారులు మండీలో ఉండగా.. 13 సిర్‌మౌర్‌, 6 శిమ్లాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, శిమ్లా, కంగ్రా, చంబా జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.  భారీ వర్షాల నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.  

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 27 విమానాల దారి మళ్లింపు..!

రాష్ట్రంలో పలు చోట్ల  జులై 10, 11 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసిన భారత వాతావరణ శాఖ జులై 13వరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గడిచిన 24గంటల్లో  శిమ్లాలోని రాంపుర్‌ బుషార్ 33 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా.. సర్హన్‌ జిల్లాలో 11 ఎం.ఎం, వంగ్టూ (కిన్నార్‌) 8 ఎం.ఎం చొప్పున నమోదైంది. మరోవైపు,  ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వానలతో  నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే.. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని