Uttarakhand: లోయలో పడిన టెంపో.. 14 మంది మృతి

23 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.

Updated : 15 Jun 2024 23:42 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ప్రయాణికులతో వెళుతున్న టెంపో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శనివారం ఉదయం 11.30 గంటలకు 23 మంది ప్రయాణికులతో టెంపో రుద్రప్రయాగ్‌ వైపుగా బయలుదేరింది. ఈ క్రమంలోనే వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ లోయ దాదాపు 150-200 మీటర్ల లోతు ఉంటుంది. రైటోలి సమీపంలో రిషికేశ్‌- బద్రీనాథ్‌ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనం లోయలోని అలనంద నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది.

అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది

ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి విచారం వ్యక్తంచేశారు. ‘‘ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని