Delhi: దిల్లీని కుదిపేసిన వడగండ్ల వాన.. ఎనిమిది విమానాలు దారిమళ్లింపు!

దేశ రాజధాని దిల్లీని భారీ వర్షం కుదిపేసింది. తీవ్ర గాలులకు తోడు వడగళ్లు పడటంతో వాహనదారులు నానాఅవస్థలు పడ్డారు.......

Published : 30 May 2022 22:36 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నగరాన్ని భారీ వర్షం కుదిపేసింది. తీవ్ర గాలులకు తోడు వడగళ్లు పడటంతో వాహనదారులు నానాఅవస్థలు పడ్డారు. హోర్డింగులు విరిగిపోయి, చెట్లు కూలిపోవడంతో అనేక చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వడగాలులకు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్లలో అంతరాయం ఏర్పడి విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఎనిమిది విమానాలను దారి మళ్లించారు. ఆ విమానాలను జైపూర్, లఖ్‌నవూ, చండీగఢ్, అహ్మదాబాద్, దేహ్రాదూన్‌లకు మళ్లించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

అంతకముందే భారీ వడగళ్లతో వాన మొదలవడంతో అప్రమత్తమైన ఇండిగో విమానయాన సంస్థ.. విమాన సర్వీసుల వేళల్లో మార్పులు ఏర్పడే అవకాశం ఉందని ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ‘దిల్లీలో వానలు, ఉరుములు మా విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ విమాన స్టేటస్‌ను చెక్‌ చేసుకోండి. సహాయం కోసం మా ట్విటర్‌/ఫేస్‌బుక్‌ ఖాతాలను సంప్రదించండి’ అంటూ ట్వీట్‌ చేసింది. విమాన రాకపోకల్లో అంతరాయాలు ఏర్పడతాయని విస్తారా ఎయిర్‌లైన్స్‌ సైతం ప్రయాణికులకు సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని