దేశీయ విమాన సేవలు పెంచిన కేంద్రం

దేశీయ విమానయాన సేవలను 70 నుంచి 80 శాతం వరకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. కొవిడ్‌-19 నేపథ్యంలో దేశీయ విమానాలను 70 శాతం వరకు నడుపుతున్నట్లు నవంబర్‌ 11న

Updated : 04 Dec 2020 01:05 IST

దిల్లీ: దేశీయ విమానయాన సేవలను 70 నుంచి 80 శాతం వరకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. కొవిడ్‌-19 నేపథ్యంలో దేశీయ విమానాలను 70 శాతం వరకు నడుపుతున్నట్లు నవంబర్‌ 11న మంత్రి చెప్పారు. అయితే కరోనా కేసులు తగ్గుదల దృష్ట్యా విమాన సర్వీసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తున్నారు. ‘‘కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మే 25న కేవలం 30 వేలతో మాత్రమే దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 2.52 లక్షల వరకు చేరిందని’’ ట్విటర్‌లో పేర్కొన్నారు. మే 25 నుంచి 33 శాతం మాత్రమే దేశీయ సర్వీసులను నడపిన విమానయాన శాఖ రానురాను దేశీయ సర్వీసులను పెంచుకుంటూ వస్తోంది. జూన్‌  26న 45 శాతం, సెప్టెంబర్‌ 2న 60 శాతం వరకు పెంచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని