India Corona: మరోరోజు 8 వేలపైనే కొత్త కేసులు.. 3 శాతం దాటిన పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోరోజు కొత్తకేసులు 8 వేల పైనే నమోదయ్యాయి.

Published : 13 Jun 2022 10:08 IST

47,995కి పెరిగిన బాధితుల సంఖ్య

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోరోజు కొత్తకేసులు 8 వేల పైనే నమోదయ్యాయి. రోజురోజుకూ పైపైకి చేరుతోన్న క్రియాశీల కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. 

* ఆదివారం 2.49 లక్షల మందికి వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,084 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో పాజిటివిటీ మూడు శాతం దాటి..3.24 శాతంగా నమోదైంది. ముందురోజు అది 2.71 శాతంగా ఉంది. ప్రస్తుతం కేసుల పెరుగుదలకు మహారాష్ట్ర, కేరళ, దిల్లీ ప్రధానంగా దోహదం చేస్తున్నాయి. దాదాపు ఆరు వేల కేసులు ఇక్కడి నుంచే వచ్చాయి. 

* ఈ ఉద్ధృతి కారణంగా క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 47,995కి చేరి, ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. క్రియాశీల కేసుల రేటు 0.11 శాతానికి చేరింది.

ఇప్పటివరకూ 4.32 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.26 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 4,592 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. కొత్త కేసులు, కోలుకుంటున్నవారి మధ్య ఉన్న భారీ అంతరం కారణంగా రికవరీ రేటు 98.68 శాతానికి పడిపోయింది. 24 గంటల్లో 10 మంది మరణించారు.

ఇక నిన్న 11.77 లక్షల మంది టీకా తీసుకోగా.. 195 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.  

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని