Helicopter ride: చదువుల్లో మెరిసి.. హెలికాప్టర్‌లో విహారంతో మురిసిన విద్యార్థులు!
ఛత్తీస్‌గఢ్‌లో 10, 12 తరగతుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను హెలికాప్టర్‌లో విహరించేందుకు అధికారులు ఛాన్స్ కల్పించారు.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు హెలికాప్టర్‌లో విహరించారు. 10, 12 తరగతుల్లో టాపర్లుగా నిలిచిన 89మంది విద్యార్థులు రాయ్‌పూర్ గగనవీధుల్లో విహరించారు. చదువుల్లో ప్రతిభ కనబరిస్తే హెలికాప్టర్(helicopter)లో ప్రయాణించే అవకాశం కల్పిస్తామంటూ గతేడాది సీఎం భూపేశ్ బఘేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది కూడా టాపర్లుగా నిలిచిన విద్యార్థులను హెలికాప్టర్‌లో విహరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో హెలికాప్టర్‌లో ఎక్కి వినువీధుల్లో విహరించిన ఆ ఆ విద్యార్థుల ఆనందానికి అవధుల్లేవు. తొలిసారి హెలికాప్టర్‌లో ప్రయాణించిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేమంటూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు.
ఛత్తీస్‌గఢ్ సెకెండరీ ఎడ్యుకేషన్ బోర్డు(CGBSE) పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారిలో మొత్తం 89మందిని ఈ ఏడాది హెలికాప్టర్ రైడ్‌కు అధికారులు ఎంపిక చేశారు. వీరిలో 49మంది పదోతరగతి విద్యార్థులు కాగా.. 30మంది 12వ తరగతి విద్యార్థులు ఉన్నారు. గిరిజన తెగకు చెందిన మరో పది మంది విద్యార్థులను ఈ జాబితాలో చేర్చి మొత్తం 89మందికి హెలికాప్టర్ రైడ్‌కు అధికారుల అవకాశం కల్పించారు. గతేడాది 125మంది ప్రతిభసాధించిన విద్యార్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. యువ హృదయాలను ప్రేరేపించడమే లక్ష్యంగా ఈ అసాధారణ కార్యక్రమం చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రేమ్‌సాయి సింగ్ టేకం, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TATA Sons IPO: అదే జరిగితే.. భారత్‌లో అతిపెద్ద ఐపీఓ టాటా గ్రూప్ నుంచే!
-
WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు.. ప్రత్యేక మెసేజ్ పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
-
Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్
-
800 Movie: విజయ్ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యలు
-
Hyderabad: గణేశ్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..!
-
Hyderabad: తెలంగాణ పోలీసింగ్ ఓ సక్సెస్ స్టోరీ: డీజీపీ