Kerala: కేరళలో మరో 9 ఒమిక్రాన్‌ కేసులు గుర్తింపు

కేరళలో మరో 9 ఒమిక్రాన్‌ కేసులను నిర్ధారించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ తెలిపారు.ఎర్నాకుళం చేరుకున్న 6గురిలో, తిరువనంతపురం...

Published : 22 Dec 2021 23:58 IST

కేరళ: కేరళలో మరో 9 ఒమిక్రాన్‌ కేసులను నిర్ధారించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ తెలిపారు.ఎర్నాకుళం చేరుకున్న ఆరుగురిలో, తిరువనంతపురం చేరుకున్న ముగ్గురిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారించినట్లు తెలిపారు. ఈ తొమ్మిది కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 24 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.ఎర్నాకుళం చేరుకున్న వారిలో యూకే నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు, టాంజానియా నుంచి వచ్చిన మహిళ, ఓ బాలుడికి, ఘనా నుంచి వచ్చిన మరో మహిళకు, ఐర్లాండ్‌ నుంచి వచ్చిన మహిళకు వైరస్‌ సోకినట్లు తెలిపారు. నైజీరియా నుంచి వచ్చిన భార్యాభర్తలు, మరో మహిళ తిరువనంతపురం చేరుకున్నట్లు వీరందరికీ ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు మంత్రి వివరించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని