ముంబయి: 90 శాతం కేసులు ఆ ప్రాంతాల్లోనే!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌ విజృంభిస్తోంది. ఇందులో మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు

Updated : 14 May 2022 11:29 IST

ముంబయి: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది. అయితే ముంబయిలో ఫిబ్రవరి నుంచి నమోదవుతోన్న కేసుల్లో 90 శాతం పాజిటివ్‌ కేసులు ఉన్నత వర్గాలు నివాసం ఉంటున్న ప్రాంతాల నుంచే వస్తున్నాయని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మిగిలిన పది శాతం కేసులు మురికివాడలు, స్కాల్స్‌లలో నమోదవుతున్నట్లు వివరించారు. ఫిబ్రవరి, జనవరిలలో ముంబయిలో దాదాపు 23,002 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 90 శాతం కేసులు ఉన్నత వర్గాలు నివశించే ప్రాంతాలు, 10 శాతం కేసులు ఇతర ప్రాంతాల్లో వచ్చినట్లు అధికారులు వివరించారు.

గత కొద్ది రోజులుగా ముంబయిలో మహమ్మారి విజృంభించడంతో మురికివాడలలో కూడా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీనిలో మధ్య, వెనకబడిన తరగతుల వారు కరోనా బారిన పడుతున్నట్లు ముంబయి సీనియర్‌ వైద్యుడు చెప్పారు. ఇప్పటివరకు నగరంలో 27 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. మరికొన్ని భవనాలకు రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మురికి వాడలలో కూడా కేసులు పెరిగిపోతుండటంతో  కొవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అసిస్టెంట్ మున్సిపల్ కమిషన్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని