
Corona: కరోనా పాజిటివ్ ఉన్నా.. నెగెటివ్ రిపోర్ట్
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓ ల్యాబ్ తప్పుడు రిపోర్టులు.. కరోనా వ్యాప్తికి కారణమయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. సిడ్ పాథ్ అనే ల్యాబ్ క్రిస్మస్‌కి ముందు చేపట్టిన కొవిడ్ నిర్థారణ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను తప్పుగా చూపించాయి. ఈనెల 22, 23, 24 రోజుల్లో జరిపిన 900 మందికి కరోనా నిర్థారణ పరీక్షల్లో అందరికీ నెగెటివ్ వచ్చిన్నట్లు రిపోర్ట్ పంపింది. అందరికీ నెగెటివ్ రావడమనేది నమ్మశక్యంగా ఉండకపోవడంతో మరోసారి పరీక్షలు నిర్వహించగా.. ఎక్కువ మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకు 900 మందికి తప్పుడు మెసేజ్‌లు పంపినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. దీనిపై ల్యాబ్ కూడా స్పందించింది.‘‘స్వాబ్ నమూనాలు భారీ సంఖ్యలో వచ్చాయి. పని ఒత్తిడి వల్లే ఇలా జరిగింది. ఆ ప్రభావం ఫలితాల మీద పడింది. అందుకు క్షమాపణ కోరుతున్నాం’’ అని సిడ్ పాథ్ ల్యాబ్ ప్రకటన విడుదల చేసింది.