సుశాంత్‌ది ఆత్మహత్యే: ఎయిమ్స్‌ బృందం

నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతిపై నెలకొన్న అనుమానాలకు ఎయిమ్స్‌ ప్రత్యేక బృందం తెరదింపింది...

Updated : 18 Dec 2022 16:02 IST

హత్య కాదని స్పష్టీకరణ

దిల్లీ: నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతిపై నెలకొన్న అనుమానాలకు ఎయిమ్స్‌ ప్రత్యేక బృందం తెరదింపింది. డా.సుధీర్‌గుప్తా నేతృత్వంలోని వైద్యబృందం సుశాంత్‌ది హత్య కాదని, ఆత్యహత్యేనని నిర్ధరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోరడంతో సుశాంత్‌ పోస్టుమార్టం నివేదికను పునఃపరిశీలించిన ప్రత్యేక బృందం నటుడిది హత్య అని వచ్చిన ఆరోపణలను కొట్టివేసింది. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు సీబీఐకి వెల్లడించింది. తమ పరిశీలన పూర్తయినట్లు స్పష్టం చేసింది. 

సుశాంత్‌సింగ్‌ జూన్‌ 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్ విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ముంబయి పోలీసులు అది ఆత్మహత్యేనని తేల్చినప్పటికీ అతడి మృతిపై కుటుంబసభ్యులు, అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. దర్యాప్తు చేపట్టిన సీబీఐ విచారణలో సహాయం అందించాల్సిందిగా ఎయిమ్స్‌ వైద్యులను కోరింది. దీంతో డా.సుధీర్‌ గుప్తా నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందం ఏర్పాటై నటుడి పోస్టుమార్టం రిపోర్టును తిరిగి పరిశీలించింది. మృతుడి శరీరంలోనుంచి పలు నమూనాలు సేకరించింది. సుశాంత్‌ ఇంటికి ముగ్గురు వైద్యులు వెళ్లి పలు నమూనాలు సేకరించారు. వాటన్నింటిని పరిశీలించి అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని