పక్షిని ఢీకొట్టిన విమానం.. ప్రయాణికులు సేఫ్‌

కోలికోడ్‌ ఘటన మరువకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో..

Updated : 08 Aug 2020 16:11 IST

రాంచీ విమానాశ్రయంలో ఘటన

రాంచీ: కోలికోడ్‌ ఘటన మరువకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సారి పక్షి తగలడంతో విమానాన్ని ఆపేసిన సంఘటన ఝార్ఖండ్‌లోని రాంచీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఎయిర్‌ ఏషియా విమానం టేకాఫ్‌ సమయంలో పక్షి తగలడంతో అధికారులు అప్పటికప్పుడు నిలిపివేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. విమానం రాంచీ నుంచి ముంబయి బయలుదేరే సమయంలో ఈ ఘటన జరిగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని