లింకన్‌ వెంట్రుకలు.. టెలిగ్రామ్‌కు రూ. 60లక్షలు!

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ తల వెంట్రుకలు, రక్తలపు మరకలతో తడిసిన ఓ టెలిగ్రామ్‌ను ఇటీవల వేలం వేయగా.. ఓ వ్యక్తి 81వేల డాలర్లు(దాదాపు రూ. 60 లక్షలు)కు సొంతం చేసుకున్నాడు. 1865 ఏప్రిల్‌ 15న జాన్‌ లిక్స్‌ బూత్‌ అనే వ్యక్తి లింకన్‌ను హత్య

Published : 16 Sep 2020 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ తల వెంట్రుకలు, రక్తపు మరకలతో తడిసిన ఓ టెలిగ్రామ్‌ను ఇటీవల వేలం వేయగా.. ఓ వ్యక్తి 81వేల డాలర్లు (దాదాపు రూ. 60 లక్షలు)కు సొంతం చేసుకున్నాడు. 1865 ఏప్రిల్‌ 15న జాన్‌ లిక్స్‌ బూత్‌ అనే వ్యక్తి లింకన్‌ను హత్య చేశాడు. ఆ తర్వాత లింకన్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు అంగుళాల పొడువున్న ఆయన తల వెంట్రుకలను కొన్నింటిని కత్తిరించి పరీక్షలు నిర్వహించిన అనంతరం వాటిని లింకన్‌ బంధువు డాక్టర్‌ లిమన్‌ బీచర్‌టోడ్‌కు అప్పగించారు. అయితే వాటిని లిమన్‌ తన జేబులో ఉన్న ఓ టెలిగ్రామ్‌ను తీసి అందులో చుట్టి భద్రపర్చారు. ఇటీవల వాటిని వేలం వేయడంతో ఓ వ్యక్తి 81వేల డాలర్లకు కొనుగోలు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని