Maoist Operation: మావోల ఏరివేతకు.. ‘అఫ్గాన్‌’ జాగిలాలు 

ఇండో- టిబెటన్‌ సరిహద్దు పోలీస్‌ (ఐటీబీపీ) కమాండో దళంలో భాగంగా ఉండి, అఫ్గానిస్థాన్‌ సంక్షోభం కారణంగా ఆ దళంతోపాటు

Published : 19 Aug 2021 09:23 IST

దిల్లీ: ఇండో- టిబెటన్‌ సరిహద్దు పోలీస్‌ (ఐటీబీపీ) కమాండో దళంలో భాగంగా ఉండి, అఫ్గానిస్థాన్‌ సంక్షోభం కారణంగా ఆ దళంతోపాటు భారత్‌కు తిరిగివచ్చిన మూడు యుద్ధ జాగిలాలను ఛత్తీస్‌గఢ్‌ అడవులకు పంపనున్నారు. ఈ అడవుల్లో సరిహద్దు పరిరక్షక దళం చేపట్టిన మావోయిస్టుల ఏరివేత కార్యకలాపాల్లో జాగిలాలు సహాయంగా ఉంటాయని అధికారులు బుధవారం వెల్లడించారు. మూడేళ్లపాటు అఫ్గాన్‌లోని మన ఎంబసీకి కాపలాగా ఉండి, మంగళవారం గాజియాబాద్‌ ఎయిర్‌ బేస్‌కు ఈ జాగిలాలు చేరుకోగానే దిల్లీకి నైరుతి దిశగా ఉన్న ఛావలా ప్రాంతంలోని ఐటీబీపీ శిబిరానికి తరలించారు. వీటిని రూబి (బెల్జియన్‌ మెలినోయిస్‌ బ్రీడ్, ఆడకుక్క), మాయ (ల్యాబ్రొడార్, ఆడ), బాబి (డాబర్‌ మ్యాన్, మగ) అని పిలుస్తారు. మందుపాతరల గుర్తింపులో పలుమార్లు చురుగ్గా వ్యవహరించిన ఈ జాగిలాలు మన దౌత్య సిబ్బందితోపాటు అఫ్గాన్‌ పౌరుల ప్రాణాలు కూడా కాపాడాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని