పోలీసుల అదుపులో అఖిలేశ్‌ యాదవ్‌

యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా లఖ్‌నవూలో ఆయన చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. నేడు కిసాన్‌ యాత్ర చేపట్టనున్నట్లు..........

Published : 07 Dec 2020 14:45 IST

లఖ్‌నవూ: యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా లఖ్‌నవూలో ఆయన చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. నేడు కిసాన్‌ యాత్ర చేపట్టనున్నట్లు.. ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని ఆదివారమే ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఉదయం నుంచే ఆయన నివాసంతో పాటు పార్టీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులు బలగాల్ని మోహరించారు.  

నివాసం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను అఖిలేశ్‌ తన మద్దతుదారులతో కలిసి ధ్వంసం చేశారు. రోడ్డుపైకి వచ్చి పార్టీ కార్యాలయం వైపు వెళుతుండగా.. పోలీసులు మధ్యలోనే అడ్డుకొని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కొవిడ్‌-19 నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మరోవైపు దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన 12వ రోజుకు చేరుకుంది.

ఇవీ చదవండి..
బంద్‌కు భారీ మద్దతు

అంబానీ-అదానీ చట్టాల్ని రద్దు చేయాలి:రాహుల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని