మమతా..మీ లేఖ భరోసానిచ్చింది: అమర్త్యసేన్‌

తన పూర్వీకుల ఆస్తికి సంబంధించి జరుగుతోన్న వివాదంలో తనకు మద్దతు ఇచ్చినందుకు ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలియజేశారు.  

Published : 28 Dec 2020 21:48 IST

కోల్‌కతా: తన పూర్వీకుల ఆస్తికి సంబంధించి జరుగుతోన్న వివాదంలో తనకు మద్దతుగా నిలిచినందుకు ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలియజేశారు.  శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని సేన్ ఆస్తి వివాదంపై శుక్రవారం మమత ఆయనకు లేఖ రాసి భాజపా ప్రభుత్వ వైఖరిని ఖండించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు చేస్తున్నందునే ఈ ఆర్థిక వేత్తకు సమస్యలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘మీరు నాకు మద్దతు ఇవ్వడం నా హృదయాన్ని హత్తుకుంది. అంత బిజీ జీవితంలో కూడా మీరు దాడికి గురవుతోన్న వారికి భరోసా ఇవ్వడానికి సమయాన్ని కేటాయించలిగారు. మీ బలమైన గళం, జరుగుతున్న వివాదంపై అవగాహన నాకు బలాన్నిచ్చాయి’ అని అమర్త్యసేన్‌ బెంగాల్ ప్రభుత్వానికి రాసిన లేఖలో వెల్లడించారు. 

అమర్త్యసేన్‌తో సహా అనేక ప్రైవేటు పార్టీల పేర్లతో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రాంగణంలోని భూమి తప్పుగా రిజిస్టర్ అయిందని ఆరోపిస్తూ విశ్వ భారతి విశ్వవిద్యాలయం ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు మీడియా నివేదించింది. అది కూడా ఆ విద్యాసంస్థ శతాబ్ది ఉత్సవాల్లో  ప్రధాని మోదీ ప్రసంగించిన సమయంలోనే చోటుచేసుకుంది. కాగా, ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 

ఇవీ చదవండి:

రైతుల కోసం ఎంతవరకైనా పోరాటం: పవన్‌

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts