ఈ చైనా వస్తువులపై అమెరికా నిషేధం!

చైనాకు చెందిన ఐదు రకాల వస్తువుల దిగుమతిపై అమెరికా నిషేధం విధించింది. కంప్యూటర్‌ విడి భాగాలు, దుస్తులు, పత్తి, వెంట్రుకలకు సంబంధించిన ఉత్పత్తులు సహా మరికొన్నింటిని నిషేధిత జాబితాలో చేర్చింది..........

Published : 15 Sep 2020 13:15 IST

వాషింగ్టన్‌: చైనాకు చెందిన ఐదు రకాల వస్తువుల దిగుమతిపై అమెరికా నిషేధం విధించింది. కంప్యూటర్‌ విడి భాగాలు, దుస్తులు, పత్తి, వెంట్రుకలకు సంబంధించిన ఉత్పత్తులు సహా మరికొన్నింటిని నిషేధిత జాబితాలో చేర్చింది. ఆ ప్రాంతంలో ఉండే వీగర్లను నిర్బంధ కార్మికులుగా మార్చి వీటిని ఉత్పత్తి చేస్తున్న కారణంగానే నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న చైనాకు బుద్ధి చెప్పాలంటే ఇలాంటి మార్గాల్ని అనుసరించక తప్పదని హోంలాండ్‌ సెక్యూరిటీ తాత్కాలిక సెక్రటరీ కెన్నెత్‌ అభిప్రాయపడ్డారు. చైనా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మానవ హక్కుల ఉల్లంఘనలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నామన్నారు. 

భద్రతాపరమైన కారణాల పేరిట లక్షలాది మంది వీగర్‌ ముస్లింలను చైనా నిర్బంధంగా‌ క్యాంపుల్లో బంధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న వారికి వృత్తి, నైపుణ్య శిక్షణ, విద్యా వసతులు కల్పించేందుకే ఈ శిబిరాలు ఏర్పాటు చేశామని డ్రాగన్‌ చెబుతున్నా.. అవన్నీ అవాస్తవాలని పలు సందర్భాల్లో నిరూపితమైంది. వీరిని నిర్బంధ కార్మికులుగా మార్చి అనేక వస్తువులను ఉత్పత్తి చేయిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచంలో పత్తి ఆధారిత ఉత్పత్తుల్లో 20 శాతం చైనా నుంచే వస్తున్నాయి. వీటిలో సింహభాగం షింజియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి వస్తున్నవే.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు