
కరోనా ధాటికి అమెరికా విలవిల!
ఒక్కరోజే రికార్డుస్థాయిలో 83వేల కేసులు
వాషింగ్టన్: కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. ఇప్పటి వరకు ఎన్నడూలేని విధంగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 83 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. జులై నెల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటికే అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 85 లక్షలకు చేరుకోగా.. వీరిలో 2 లక్షల 24వేల మంది మృత్యవాతపడ్డారు. ఇక జులై 16వ తేదీన అత్యధికంగా ఒక్కరోజే 77,632 కేసులు నమోదయ్యాయి. మూడు నెలల తర్వాత తాజాగా ఒకరోజు వ్యవధిలోనే రికార్డుస్థాయిలో 83,757 కేసులు బయటపడ్డాయి. ముఖ్యంగా కనెక్టికట్ రాష్ట్రంతోపాటు సమీప ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.
నిండిపోతున్న ఆసుపత్రులు..హెచ్చరిస్తున్న గవర్నర్లు..
అధిక జనసాంద్రత, జనాభా కలిగిన భారత్ వంటి దేశాల్లో కరోనా వైరస్ కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. కానీ, అమెరికాలో మాత్రం ఇలాంటి పరిస్థితులు కనిపించడంలేదు. పలుచోట్ల లాక్డౌన్ విధిస్తుండడంతోపాటు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కొన్నిచోట్ల ఆసుపత్రులు నిండిపోవడంతో సియాటెల్, పోర్ట్లాండ్, ఒరేగన్ ప్రాంతాలకు రోగులను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా తరలిస్తున్నారు. మరికొన్ని ఆసుపత్రుల్లో చిన్నారులను మినహా ఎవ్వర్నీ చేర్చుకునే పరిస్థితులు లేవని అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో ఆయా రాష్ట్రాల గవర్నర్లు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ‘కరోనా వైరస్ బారినపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఎవరైతే మాస్కు ధరించకుండా తిరుగుతారో వారికి టీకా వేయం’ అని ఉతాహ్ రాష్ట్ర గవర్నర్ గ్యారీ హెర్బర్ట్ ప్రకటించారు. ఇలాంటి నిర్ణయం మంచిది కానప్పటికీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదుకావడంతోనే ఈ చర్యలు చేపట్టాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తే.. రాష్ట్రంలో ఆరోగ్యవ్యవస్థ పూర్తిగా చేతులెత్తేయాల్సిన ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ చాలాప్రాంతాల్లో అధికారుల సూచనలను ప్రజలను పట్టించుకోవడం లేదని.. దీంతో వైరస్ ఉద్ధృతి అదుపులోకి రావడంలేదని అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు.
వారంలో భారీగా పెరిగిన తీవ్రత..
ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి చూస్తుంటే యూరప్‌లో విజృంభించిన మాదిరిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ డకోటా, ఉతాహ్, ఇదాహో రాష్ట్రాలు వైరస్ ధాటికి వణికిపోతున్నాయి. అమెరికాలో గత కొద్దిరోజులుగా వారంలో సరాసరి కేసుల సంఖ్య 44 వేలు ఉండగా ప్రస్తుతం అది 61వేలకు పెరగడం అక్కడ పరిస్థితి అద్దం పడుతోంది. అయితే, వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పలుచోట్ల ప్రజల నుంచి మద్దతు కరువవుతోంది. మాస్కులు, భౌతికదూరం, లాక్డౌన్ ఆంక్షలపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. ఇదే సమయంలో అధ్యక్ష ఎన్నికలు కూడా వైరస్ తీవ్రతపై ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ నిబంధనలు పాటించకుండానే ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలు దర్శనమిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
BJP: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా చేయాలి తప్ప ఇలానా?: భాజపా నేత ఇంద్రసేనారెడ్డి
-
Sports News
IND vs ENG: జడేజా ఈజ్ బ్యాక్.. అతడుంటే ఓ భరోసా..!
-
Movies News
Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
-
Politics News
Maharashtra: బలపరీక్ష ‘సెమీ-ఫైనల్’లో శిందే వర్గం విజయం!
-
Crime News
Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి