రైతుల్ని చర్చలకు రమ్మని అమిత్‌షా పిలుపు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతుల్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చర్చలకు ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం 7గంటలకు రైతులు చర్చలకు రావాలని అమిత్‌షా తమను ఆహ్వానించారని.. రైతు సంఘాల నాయకుడు రాకేశ్‌ టికైట్‌ తెలిపారు.

Published : 08 Dec 2020 15:30 IST

దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతుల్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చర్చలకు ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం 7గంటలకు రైతులు చర్చలకు రావాలని అమిత్‌షా తమను ఆహ్వానించారని.. రైతు సంఘాల నాయకుడు రాకేశ్‌ టికైట్‌ తెలిపారు. ఈ మేరకు షా తమను ఫోన్‌ కాల్‌ ద్వారా సంప్రదించినట్లు రాకేశ్‌ చెప్పారు. ‘ చర్చలకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ చేశారు. 7 గంటలకు సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు. దిల్లీ సమీపంలో జాతీయ రహదారులపై నిరసనలు కొనసాగిస్తున్న రైతులు సమావేశానికి హాజరు అవుతారు’ అని రాకేశ్‌ వెల్లడించారు. ఓ వైపు రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్‌ కొనసాగుతున్న క్రమంలో షా ఇప్పుడు అత్యవసరంగా చర్చలకు ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చలు జరిపి రైతుల నిరసనలకు స్వస్తి పలకాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు 13 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఐదో విడత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో డిసెంబర్‌ 8న రైతు సంఘాలు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు, ట్రేడ్‌ యూనియన్లు, ఇతర ఉద్యోగ సంఘాలు భారీగా మద్దతు పలికాయి. 

ఇదీ చదవండి

దిల్లీ శివారులో ఆగిన మరో రైతన్న గుండె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని