ఫేస్‌బుక్‌ పదవికి అంఖి దాస్‌ రాజీనామా!

భారత ఫేస్‌బుక్‌ సంస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత, దక్షిణ మధ్య ఆసియా పబ్లిక్‌ పాలసీ డైరక్టర్‌ అంఖిదాస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 28 Oct 2020 00:40 IST

దిల్లీ: భారత ఫేస్‌బుక్‌ సంస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత, దక్షిణ మధ్య ఆసియా పబ్లిక్‌ పాలసీ డైరక్టర్‌ అంఖీదాస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘అంఖి దాస్‌ ప్రజా సేవపై ఉన్న ఆసక్తి మేరకే తన పదవి నుంచి వైదొలిగారు. అంతేకానీ ఎలాంటి వివాదాస్పద కారణాలు లేవు. ఫేస్‌బుక్‌ ఇండియాలో ఆమె 9 ఏళ్ల నుంచి ఉన్నారు. సంస్థ అభివృద్ధికి ఎంతో కీలక పాత్ర పోషించారు. కంపెనీకి గొప్ప సేవలు అందించారు. భవిష్యత్తులో ఆమె విజయాలు సాధించాలి’ అని సంస్థ పేర్కొంది.

కాగా ఓ జాతీయ పార్టీకి లబ్ది చేకూర్చే విధంగా వ్యవహరించినట్లు అంఖిదాస్‌పై ఆరోపణలు వచ్చిన కొద్ది నెలల్లోనే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. హిందూ జాతీయవాద వ్యక్తులకు సంబంధించిన విద్వేష ప్రసంగాలపై పరిమితుల విషయంలో అంఖిదాస్ ‌ చూసీచూడనట్లు వ్యవహరించారని ఆగస్టులో ఓ జర్నల్‌ ప్రచురించింది. ఈ వ్యవహారంలో ఆమెతో పాటు ఫేస్‌బుక్‌ సంస్థ సైతం విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని