రైతులకు మద్దతుగా అన్నాహజారే నిరాహారదీక్ష

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు భారత్‌ బంద్‌ చేపట్టిన అన్నదాతలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. రైతులకు మద్దతు ప్రకటిస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే మంగళవారం నిరాహార దీక్షకు దిగారు

Updated : 08 Dec 2020 11:49 IST

పుణె: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు భారత్‌ బంద్‌ చేపట్టిన అన్నదాతలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. రైతులకు మద్దతు ప్రకటిస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే మంగళవారం నిరాహార దీక్షకు దిగారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తన స్వగ్రామమైన రాలేగావ్‌ సిద్ధిలో ఒక రోజు దీక్షకు కూర్చున్నారు. 

‘గత కొద్ది రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా రైతులు ఆందోళన సాగించడం అభినందనీయం. ఇప్పుడు ఆ ఆందోళనను దేశమంతా చేపట్టాలని యావత్ ప్రజలను కోరుతున్నా. ఇందుకోసం రైతులంతా రోడ్డెక్కాలి. అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి రైతుల డిమాండ్లను పరిష్కరిస్తుంది. అయితే, నిరసనల్లో ఎక్కడా హింసకు పాల్పడకూడదు’ అని అన్నాహజారే వీడియో సందేశం ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. 

రైతులకు న్యాయం జరగాలంటే ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని హజారే అభిప్రాయపడ్డారు. అంతేగాక, అగ్రికల్చరల్‌ కాస్ట్‌ అండ్‌ ప్రైసెస్‌ కమిషన్‌(సీఏసీపీ)కి స్వయం ప్రతిపత్తి కల్పించాలన్నారు. ప్రభుత్వం హామీలే ఇస్తుంది. అంతేగానీ.. వాటిని నెరవేర్చడంలో విఫలమవుతూనే ఉందని హజారే విమర్శించారు. 

ఇవీ చదవండి..

భారత్‌ బంద్‌: రోడ్డెక్కిన రైతులు.. నిలిచిన రైళ్లు

రైతులకు అమెరికా నేతల మద్దతు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని