యాంటీ షిప్‌ మిసైల్‌ను ప్రయోగించిన భారత్‌

భారత క్షిపణి ప్రయోగాల పరంపర కొనసాగుతోంది. సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా భారత్‌ అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో వరుస క్షిపణి ప్రయోగాలు చేపట్టిన భారత్‌.. తాజాగా యాంటీ షిప్‌ మిసైల్‌ (ఏఎస్‌హెచ్ఎం)ను పరీక్షించింది. బంగాళాఖాతంలో యుద్ధనౌక..

Updated : 30 Oct 2020 16:38 IST

దిల్లీ: భారత క్షిపణి ప్రయోగాల పరంపర కొనసాగుతోంది. సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా భారత్‌ అడుగులేస్తోంది.  ఇటీవల కాలంలో వరుస క్షిపణి ప్రయోగాలు చేపట్టిన భారత్‌.. తాజాగా యాంటీ షిప్‌ మిసైల్‌ (ఏఎస్‌హెచ్ఎం)ను పరీక్షించింది. బంగాళాఖాతంలో యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోర నుంచి ఇండియన్‌ నేవీ ఈ ప్రయోగం చేపట్టింది. నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి సులువుగా ఛేదించిందని వెల్లడించింది. క్షిపణి ఢీ కొట్టడంతో లక్షిత నౌక పేలిపోయి.. పొగలు వస్తున్న ఫోటోను ఇండియన్‌ నేవీ విడుదల చేసింది.

భారత్‌-చైనా మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ ఇటీవల వరుసగా క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. అత్యంత సమర్థవంతమైన క్షిపణులను దేశీయంగా తయారు చేయడంపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒడిశా తీరంలోని వీలర్‌ ఐలాండ్‌లో ఏపీజే అబ్దుల్‌ కలాం లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి హైపర్‌సోనిక్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ వెహికల్‌ను ప్రయోగించింది. ఆ తర్వాత బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి, అణు సామర్థ్యం కలిగిన శౌర్య సూపర్‌ సోనిక్‌ క్షిపణి, జలాంతర్గాములను ధ్వంసం చేయగల క్షిపణి సహాయక టోర్పెడో, లేజర్‌ గైడెడ్‌ యాంటీ ట్యాంక్‌ క్షిపణులను భారత్‌ వరుసగా ప్రయోగించింది. అంతే కాకుండా శత్రుదుర్భేద్యమైన అభ్యాస్‌ గగన తల వాహనాల్ని, పృథ్వీ-2, రుద్రం-1 క్షిపణులను కూడా భారత్‌ ప్రయోగించి విజయం సాధించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని