
మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం
యెరవాన్: ఆర్మేనియా, అజర్బైజాన్ దేశాల సరిహద్దు నాగోర్నో- కరాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం చెలయించడానికి ఈ రెండు దేశాలు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నాయి. తాజాగా ఈ ఏడాది జులైలో ప్రారంభమైన ఆధిపత్య పోరు మొన్న నిన్నటి వరకూ కొనసాగింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని దాడులు చేసుకోవడంతో వందల మంది సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఆర్మేనియాకు సహాకారం అందిస్తున్న రష్యా రెండు దేశాలతో సుదీర్ఘంగా చర్చించి గతవారం కాల్పుల విరమణ ఒప్పందం చేయించింది.
ఈ ఒప్పందం జరిగిన వారం రోజుల్లోనే తిరిగి రెండు దేశాల మధ్య మరోసారి కాల్పులు జరిగి పలువురు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చి మరోసారి మనవతా దృక్పథంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. నాగోర్నో- కరాబాఖ్ ప్రాంతం భౌగోళికపరంగా అజర్బైజాన్ దేశంలో ఉంది. అయినా అజర్బైజాన్ విధానాలను వ్యతిరేకించే ఆర్మేనియా బలగాలే ఎప్పటి నుంచో దానిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇదిలా ఉంటే అజర్బైజాన్కు టర్కీ సహకారం అందిస్తోంది.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.