చట్టాన్ని ఉల్లంఘించిన బలగాలపై చర్యలు

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఈ ఏడాది జులైలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ విషయంలో తమ బలగాలు చట్టాన్ని ఉల్లంఘించాయని ఆర్మీ పేర్కొంది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉల్లంఘనకు పాల్పడ్డాయని.....

Published : 18 Sep 2020 20:16 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఈ ఏడాది జులైలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ విషయంలో తమ బలగాలు చట్టాన్ని ఉల్లంఘించాయని ఆర్మీ పేర్కొంది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉల్లంఘనకు పాల్పడ్డాయని పేర్కొంది. ఈ మేరకు వారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది జులై 18న షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయినట్లు ఆర్మీ పేర్కొంది. చనిపోయిన ఆ ముగ్గురూ రాజౌరీ జిల్లాకు చెందిన కూలీలుగా తర్వాత తేలింది. సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా వెలుగుచూసిన ఈ విషయంపై ఆర్మీ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ ప్రకారం ఎన్‌కౌంటర్‌ సమయంలో ఏఎఫ్‌ఎస్‌పీఏ 1990, ఆర్మీ చీఫ్‌ నిర్దేశించిన నియమాలను ఉల్లంఘించాయని తేలినట్లు ఆర్మీ తెలిపింది. దీంతో ఆర్మీ చట్టం కింద క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు పేర్కొంది. అయితే ఎంతమందిపై చర్యలు తీసుకునేదీ వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని