అనుమానిత ఉగ్ర దాడిలో జవాన్‌ మృతి..! 

అరుణాచల్‌ప్రదేశ్‌లోని చంగ్లాంగ్‌ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జవాన్లు ప్రయాణిస్తోన్న నీటి ట్యాంకర్‌పై దాడికి తెగబడ్డారు. దీంతో అసోం రైఫిల్స్‌కు చెందిన ఓ జవాన్‌ మరణించగా.. మరొకరు గాయపడ్డారు.

Published : 04 Oct 2020 23:22 IST

ఈటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌లోని చంగ్లాంగ్‌ జిల్లాలో జరిగిన దాడిలో ఓ జవాన్‌ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. జైరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హెట్లాంగ్‌ గ్రామంలో ఈ రోజు ఉదయం నీళ్ల ట్యాంకర్‌ను తీసుకెళ్తున్న వాహనంపై ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు.

చంగ్లాంగ్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ దేవాన్ష్‌ యాదవ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 19వ అసోం రైఫిల్స్‌కు చెందిన ఓ నీటి ట్యాంకర్‌ హెట్లాంగ్‌కు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మొదట అక్కడ బాంబు పేలుడు జరిగినట్లు తమకు సమాచారం వచ్చింది.. కానీ పూర్తిస్థాయిలో నివేదికలు వచ్చే వరకు అది బాంబు దాడిగా నిర్ధారించలేమని చెప్పారు. జవాన్‌ మరణానికి మాత్రం బుల్లెట్‌ గాయాలే కారణమన్నారు. గాయపడిన జవాన్‌ను ఆస్పత్రిలో చేర్చినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ దాడికి బాధ్యులమంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించకోలేదు. యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ లేదా ఎన్‌ఎస్‌సీఎన్‌ కే దళాలు ఈ కుట్రకు తెగబడినట్లు అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని