Published : 29 Aug 2020 21:41 IST

44 ఏళ్లలోనే అత్యధికం: ఐఎండీ

 

దిల్లీ: 44 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శనివారం వెల్లడించింది. ఈ వర్షాల కారణంగా భారత్‌లో చాలా ప్రాంతాల్లో వరదలు సంభవించి, జనజీవనాన్ని ఆటంకపర్చాయి.  

ఆగస్టు నెలలో సాధారణం కంటే 25 శాతం అధిక వర్షపాతం కురిసిందని ఐఎండీ తెలిపింది. ఆ విభాగం వెల్లడించిన వివరాల  ప్రకారం..1976 తరవాత  భారీ వర్షాలు కురిశాయి. అంటే సరిగ్గా 44ఏళ్ల కిందట రికార్డు స్థాయిలో 28.4 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మొత్తం మీద వర్షకాలం మొదలైన దగ్గరి నుంచి సాధారణం కంటే  తొమ్మిది శాతం అధికంగా వానలు పడ్డాయి. బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, గోవా వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవగా..కొన్నింటిలో నదులు పొంగి, వరదలకు కారణమయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఆగస్టు 27 నాటికి రిజర్వాయర్ల పరిస్థితి మెరుగ్గా ఉందని సెంట్రల్ వాటర్‌ కమిషన్‌ వెల్లడించింది.  

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts