ఆస్ట్రేలియా టీకాతో ప్రతికూల మార్పులు!

ఆస్ట్రేలియాలో దేశీయంగా తయారుచేస్తున్న ఓ కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేశారు. తొలి దశలో ఆశాజనక ఫలితాలిచ్చిన ఈ టీకా రెండు, మూడో దశలో మానవ శరీరంలో కొన్ని ప్రతికూల మార్పులకు కారణమైనట్లు తేలిందని అధికారులు తెలిపారు.........

Published : 11 Dec 2020 18:00 IST

ప్రమాదం కానప్పటికీ ప్రయోగాల్ని రద్దు చేసిన ప్రభుత్వం

సిడ్నీ: ఆస్ట్రేలియాలో దేశీయంగా తయారుచేస్తున్న ఓ కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేశారు. తొలి దశలో ఆశాజనక ఫలితాలిచ్చిన ఈ టీకా రెండు, మూడో దశలో మానవ శరీరంలో కొన్ని ప్రతికూల మార్పులకు కారణమైనట్లు తేలిందని అధికారులు తెలిపారు. అయితే, అవి అంత ప్రమాదకరమైనవేమీ కానప్పటికీ.. టీకా ప్రయోగాల్ని, అభివృద్ధిని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ విశ్వవిద్యాలయం, ఔషధ తయారీ సంస్థ సీఎస్‌ఎల్‌ సంయుక్తంగా ఓ టీకాను తయారుచేశాయి. ప్రాథమిక ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు రావడంతో క్లినికల్‌ ట్రయల్స్‌ని ప్రారంభించారు. తొలి దశలో ఆశాజనక ఫలితాలే వచ్చాయి. టీకాతో ఉత్పత్తయిన యాంటీబాడీలు కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాయి. కానీ, రెండు, మూడో దశలో కొన్ని ప్రతికూల మార్పులను గమనించారు. ఈ టీకా వల్ల ఏర్పడిన యాంటీబాడీలు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలో కలగజేసుకుంటున్నట్లు కనిపెట్టారు. దీనివల్ల హెచ్‌ఐవీ లేనివారికి కూడా పాజిటివ్‌గా తేలిందని గుర్తించారు. కొంతకాలం తర్వాత మళ్లీ వారికే హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌గా వచ్చింది. టీకా వల్ల ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ.. హెచ్‌ఐవీ నిర్ధారణ విషయంలో యాంటీబాడీలు కలగజేసుకుంటున్నందుకు ప్రయోగాల్ని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు.

టీకా అభివృద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయడం కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ.. కొందరిలో గుర్తించిన ప్రతికూల మార్పుల వల్ల తప్పడం లేదని సీఎస్‌ఎల్‌ పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ కొనుగోలుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సీఎస్‌ఎల్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఒప్పందంతో కంపెనీకి దాదాపు 75 మిలియన్‌ డాలర్ల అదనపు ఆదాయం సమకూరేది. ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైజర్‌ సహా మరికొన్ని సంస్థలతో భారీ ఎత్తున టీకా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రజలకు వ్యాక్సిన్‌ అందజేయడంలో ఎలాంటి జాప్యం జరిగే అవకాశం లేదు.

ఇవీ చదవండి..

డబ్ల్యూహెచ్‌వో ఆందోళన నిజమైంది!

అమెరికాలో వ్యాక్సినేషన్‌ దిశగా కీలక అడుగు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని