అయోధ్యలో భూమిపూజ ప్రారంభం

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు.

Updated : 03 Aug 2020 14:08 IST

గౌరీ గణేశ పూజతో కార్యక్రమానికి శ్రీకారం

అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. 11 మంది పూజారుల శాస్త్రోక్త మంత్ర పఠనం మధ్య, ఈ ఉదయం ఎనిమిది గంటలకు హిందూ సంప్రదాయ ప్రకారం.. గౌరీ గణేశ పూజతో ఈ కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా అయోధ్య పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాగా, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రామాలయాల్లో కూడా రామాయణ పారాయణం కొనసాగింది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న భూమిపూజ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మందిర నిర్మాణం మొదలవుతుందని స్థానిక పూజారులు వివరించారు. గణపతి ఆశీస్సులతో ఆలయ నిర్మాణం ఏ ఆటంకం లేకుండా పూర్తి కాగలదని పలువురు భావిస్తున్నారు.

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశానుసారం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రామ మందిర నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, భూమి పూజను పురస్కరించుకుని ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసులు పట్టణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీతో సహా పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో పటిష్టమైన చర్యలను చేపడుతున్నారు. మరోవైపు ప్రధాన పూజారి సహాయకుడితో పాటు పలువురు పోలీసు సిబ్బందికి కరోనా వైరస్‌ వ్యాధి సోకిన నేపథ్యంలో... కొవిడ్‌-19 ప్రొటోకాల్‌ను కూడా కచ్చితంగా అమలు జరుపుతున్నామని డీఐజీ దీపక్‌ కుమార్‌ వెల్లడించారు. పట్టణంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకుండా ఆంక్షలు విధించినట్టు ఆయన వివరించారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చి,  45 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిని మాత్రమే ప్రధాని భద్రతా విధుల్లో వినియోగిస్తామని అధికారులు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని