గుజరాత్‌ ఉపఎన్నికల్లో భాజపా జోరు

గుజరాత్‌ ఉపఎన్నికల కౌంటింగ్‌లో భాజపా దూసుకుపోతోంది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరగగా ఆ మొత్తం ప్రాంతాల్లో కమలం జోరు కొనసాగిస్తోంది...

Published : 10 Nov 2020 19:10 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ ఉపఎన్నికల కౌంటింగ్‌లో భాజపా దూసుకుపోతోంది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరగగా ఆ మొత్తం ప్రాంతాల్లో కమలం జోరు కొనసాగిస్తోంది. లింబిడి, దాంగ్‌ నియోజకవర్గాల కౌంటింగ్‌లో భాజపా భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో భాజపాతో పోటీపడ్డ కాంగ్రెస్‌ అనంతరం తేలిపోయింది. ప్రతి రౌండ్‌ కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ వెనకబడిపోయింది. మోర్బిలో మొదట్లో లీడింగ్‌లో ఉన్న హస్తం తర్వాత వెనకంజ వేసింది. ప్రస్తుతం భాజపా భారీ ఆధిక్యంలో ఉంది. లింబిడి, గధాడలో కాషాయం విజయం దిశగా దూసుకుపోతోంది. మిగతా ఆరు నియోజకవర్గాలైన దంగ్‌, కార్జన్‌, అబ్దాసా, ధారి, మోర్బి, కప్రాడాల్లోనూ భాజపా లీడింగ్‌లో ఉంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని